కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా కోటనందూరు మండలంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో కే.ఈ చిన్నయ్యపాలెంలోని గౌరీపరమేశ్వరస్వామి ఆలయం వద్ద శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల మహిళా భక్తులు భారీగా తరలివచ్చి కార్తిక దీపారాధన, అభిషేకాలు నిర్వహించారు.