రౌతులపూడి గ్రామానికి చెందిన వివాహిత ఆత్మహత్య కేసులో, అదే గ్రామానికి చెందిన రావాడ నానిబాబును శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. అశ్లీల వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం వల్లే తన భార్య మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని భర్త కె. వరహాలబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆమె మే 1న మృతి చెందింది. ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తుని కోర్టులో హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.