తాళ్లూరులో భారీ అగ్నిప్రమాదం: రెండు ఇళ్లు దగ్ధం, కుటుంబాలు నిరాశ్రయులు

1220చూసినవారు
తాళ్లూరులో భారీ అగ్నిప్రమాదం: రెండు ఇళ్లు దగ్ధం, కుటుంబాలు నిరాశ్రయులు
కాకినాడ జిల్లా తుని మండలం తాళ్లూరులో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో షేక్ మహబూబ్ నిషా, షేక్ అమ్మాజీ, షేక్ షెలార్ బిబి కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటిలోని గృహోపకరణాలు, నగదు కూడా మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రెవిన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.

సంబంధిత పోస్ట్