తుని జీఎన్‌టీ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద, తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేక ఒక కోతి అక్కడున్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకుని తాగింది. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసిన స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.