తునిలో రెండే బంకులు ఓపెన్..!

1093చూసినవారు
తునిలో తీవ్రమైన ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా డీజిల్ బంకులు మూతపడగా, కేవలం రెండు బంకుల్లోనే పెట్రోల్ అందుబాటులో ఉంది. సోమవారం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. బైకులకు రూ. 200 వరకే పెట్రోల్ పోస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.