తుని చిన్నారి జ్ఞానేశ్వరి గాలింపుపై పవన్ సమీక్ష

438చూసినవారు
తుని చిన్నారి జ్ఞానేశ్వరి గాలింపుపై పవన్ సమీక్ష
తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. దట్టమైన అడవుల్లో గాలింపు కోసం అటవీశాఖ నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్లు, నిపుణుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం 400 మందికిపైగా సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్