కాకినాడ, తుని పరిధిలోని సీహెచ్ ఆగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 24 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. పోలీసులు గ్రామాల్లో గోడపత్రికలు, కరపత్రాలు పంచుతూ, కూలీలను సైతం విచారిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు. చిన్నారిని గుర్తించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. స్థానికులు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.