రైల్వే స్టేషన్ లో పాముల సంచారం కలకలం

3చూసినవారు
రైల్వే స్టేషన్ లో పాముల సంచారం కలకలం
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో పాముల సంచారం కలకలం రేపుతోంది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాల కారణంగా సమీపంలోని పుట్టల్లోంచి పాములు బయటకు వస్తున్నాయని, స్టేషన్ ప్రాంగణంలో పాత భవనాలు, చెట్లు ఉండటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో సిబ్బంది కొన్ని పాములను పట్టుకున్నారు. విషసర్పాలు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్