తునిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నారాయణరావు మృతిపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు కీలక ప్రకటన చేశారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేశారు. నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో టాయిలెట్ కోసం వాహనం ఆపారని, అప్పుడే నారాయణరావు చెరువులో దూకినట్లు శబ్దం వచ్చిందన్నారు. దీంతో చుట్టుపక్కల, చెరువులో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు.