వర్షాకాలం ప్రారంభం కావడంతో తుని సమీపంలోని తూర్పు కనుమలు పచ్చని ప్రకృతి సోయగాలతో కళకళలాడుతున్నాయి. జాతీయ రహదారి-16 వెంబడి విస్తరించిన కొండలను మేఘాలు చుట్టుముట్టడంతో, ఈ ప్రాంతం చూడటానికి ఊటీని తలపిస్తోంది. పచ్చని కొండలు, జల్లులు కురుస్తున్న వేళ కొండల మధ్య మేఘాలు కదులుతున్న దృశ్యాలు పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటూ మంత్రముగ్ధులను చేస్తున్నాయి.