తుని: రైలు ఢీకొని హిజ్రా మృతి

2667చూసినవారు
తుని: రైలు ఢీకొని హిజ్రా మృతి
సోమవారం రాత్రి తుని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని హిజ్రా (30) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ జి. శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. అతను ఆకుపచ్చ, నలుపు రంగుల పువ్వుల టాప్, తెల్లచున్నీ, నలుపు లెగ్గిన్స్ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై 'అమ్మ' అని ఆంగ్లంలో రాసి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్