తుని జీఆర్పీ పరిధిలోని అన్నవరం-రావికంపాడు స్టేషన్ల మధ్య గురువారం సాయంత్రం హౌరా-బెంగళూరు రైలు నుంచి జారిపడి పశ్చిమ్ బంగాల్లోని బర్హ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ధూకుమార్ బగ్డి అనే యువకుడు మృతి చెందాడు. కూలి పనుల నిమిత్తం బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై జి. శ్రీనివాసరావు తెలిపారు. యువకుడి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు.