
తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తుని – గుల్లిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో సంబల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు వస్తుండగా, ట్రాక్ దాటుతున్న గుర్తుతెలియని (35) వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.







































