మంత్రి నారా లోకేశ్ కి ఘన స్వాగతం

4చూసినవారు
మంత్రి నారా లోకేశ్ కి ఘన స్వాగతం
ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించి, విద్యార్థులతో 'హలో లోకేశ్' కార్యక్రమంలో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అనంతరం కోరమండల్ ఆసుపత్రిని ప్రారంభించి, పార్టీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేయనున్నారు. మంత్రి రాకతో కాకినాడ, రాజమహేంద్రవరం పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్