టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం #VenkyAnil5, #NKRAR2 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. నందమూరి కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్‌రామ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.