టాలీవుడ్‌లో వినూత్న చిత్రాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ప్రేమ, సస్పెన్స్‌తో కూడిన సైకో-రోమాంటిక్ థ్రిల్లర్ “కళ్యాణం కమనీయం జీవితం” తెరకెక్కుతోంది. ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాతలు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ టైటిల్, పోస్టర్ బాగున్నాయని ప్రశంసించారు.