AP: కన్నడ సినిమా ‘కాంతారా చాప్టర్ 1’టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపొద్దు. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ చర్చించుకోవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతా’ అని తెలిపారు.