పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను
భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులపై నిందలు వేయడం మానేసి, తమ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ సూచించింది. కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో భారత ప్రమేయం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, నలుగురు గాయపడ్డారు.