AP: మంత్రి లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. APకి వస్తున్న పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడు వృద్ధి రేటు 2024–25లో 11.19% కాగా, ఏపీది 8.21% మాత్రమేనని గుర్తుచేస్తున్నారు. తమిళనాడు పరిశ్రమల కేంద్రం, బెంగళూరు ఐటీ రాజధాని అని వాదిస్తున్నారు. అయితే, AP కొత్త రాష్ట్రం కావడంతో గూగుల్ వంటి పెట్టుబడులు రావడం సానుకూలమని మరికొందరు లోకేశ్‌కు మద్దతు ఇస్తున్నారు.