AP: పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌కు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు. ‘అందరూ స్పైసీ ఇష్టపడినా, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పొరుగగువారి అప్పులు రూ.10 లక్షల కోట్లు పెరిగాయి. ఏడాదిలోపే రూ.1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రెవెన్యూ లోటు 3.61 శాతానికి పెరిగింది’ అని ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు.