AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనా స్థలాన్ని మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎంతమంది మృతి చెందారో, ఎవరెవరికి గాయాలయ్యాయో ఆరా తీశారు. బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. భక్తులు భారీగా వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా, ఆలయ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.