AP: నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినప్పటికీ, అది అపరిమితం కాదని, సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, బాధితులకు న్యాయం చేయడంతో పాటు, తప్పుదోవ పట్టిన వారిని దారిలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.