KVS 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక ప్రవేశాల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. అలాగే 1, 2, 3 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల ఫలితాలను కూడా కేవీస్ రేపు విడుదల చేయనుంది. ఫలితాలను అధికారిక KVS పోర్టల్స్‌లో చెక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన తొలి విడత ఫలితాలను వెల్లడించింది. ఓట్ల పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో మాత్రం ఒకటవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు కేవీఎస్ అధికారులు తెలిపారు.