మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో పుణెకు చెందిన బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాబోయే భర్త కేతన్‌ను సియా తన ప్రియుడితో కలిసి లోయలోకి తోసేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో లోహగఢ్ కోటకు పర్యాటకుల రద్దీ పెరిగింది. టూరిస్టుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిందని, ‘సియా గోయల్ పాయింట్’ ఎక్కడ ఉందో చూపించమని అడుగుతున్నారని కోట నిర్వాహకులు చెబుతున్నారు.