కేతన్ హత్య కేసు.. లై డిటెక్టర్‌కు అంగీకరించని సియా, చేతన్‌

11968చూసినవారు
కేతన్ హత్య కేసు.. లై డిటెక్టర్‌కు అంగీకరించని సియా, చేతన్‌
కేతన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులు సియా, చేతన్‌లకు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే పాలీగ్రాఫ్ పరీక్షకు వారు అంగీకరించకపోవడంతో నిజ నిర్ధారణ పరీక్షకు కోర్టు అనుమతి నిరాకరించింది. ఇదే సమయంలో దర్యాప్తు కొనసాగించేందుకు నిందితులు సియా, చేతన్‌లకు 14 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్