AP: పోలీసుల తీరుపై
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.