ఫెడ్ కొత్త చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ ఎంపిక.. ట్రంప్ ప్రకటన

2416చూసినవారు
ఫెడ్ కొత్త చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ ఎంపిక.. ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను సెంట్రల్ బ్యాంక్ కొత్త చైర్మన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ పదవీ కాలం మేలో ముగియనుంది. ట్రంప్ ఈ విషయాన్ని ట్రూత్ సోషియల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రకటించారు. సెనేట్ ఆమోదిస్తే వార్ష్ ఫెడ్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆయన హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌‌లో ఫెలోగా, స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఎంపికతో ఫెడ్‌ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్, బ్లాక్‌రాక్‌కి చెందిన రిక్ రీడర్, ట్రంప్‌ టాప్ ఎకనామిస్ట్ కెవిన్ హాసెట్, కెవిన్ వార్ష్‌ మధ్య పోటీ ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్