దేశీ ఏరోస్పేస్ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్, రష్యాకు చెందిన యూఏసీతో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్–114–300 రకం విమానాలను 180–200 మిలియన్ డాలర్ల విలువతో కొనుగోలు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విమానాలను పూర్తిగా దేశీయంగా తయారు చేయడం, సాంకేతిక సహకారం అందించడం, అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్ వంటివి ఇక్కడే చేపట్టడం జరుగుతుంది. 2032 నాటికి దేశీయంగా విమానాల రూపకల్పన పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందని, ప్రాంతీయంగా స్వల్ప, మధ్య దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ శుభకర్ పప్పుల తెలిపారు.