AP: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కూర్పు ఖరారు చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకూ ఐదు కేటగిరీలుగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల్ని మూడు కేటగిరీలకు కుదించారు. ఈ మూడు కేటగిరీలు కాకుండా మిగిలిపోయిన పంచాయతీ కార్యదర్శుల్ని రూర్పన్ పంచాయతీలు, గ్రేడ్ 1 పంచాయతీల్లో వాడుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు.