కూటమి కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

13581చూసినవారు
కూటమి కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
ఏపీ ప్రభుత్వం పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్