SIRపై కీలక నిర్ణయం.. విచారణల షెడ్యూలింగ్ ఇక ఆప్షనల్

19చూసినవారు
SIRపై కీలక నిర్ణయం.. విచారణల షెడ్యూలింగ్ ఇక ఆప్షనల్
AP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్, అదనపు సీఈవో దిల్లీరావు గురువారం జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేయడంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ అమలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విచారణల షెడ్యూలింగ్‌ను ఆప్షనల్ చేశారు. పేదలు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలు, యువత కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్