జూలై 1, 2026 నుంచి పలు ఆర్థిక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఆధార్‌లో ఈ-మెయిల్ అప్‌డేట్ సేవ జులై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఉచితంగా అందించబడుతుంది. పాస్‌పోర్ట్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.