ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు.. 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలు ఖరారు

7చూసినవారు
ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు.. 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలు ఖరారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు మొత్తం 1,36,326 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 23న ముసాయిదా జాబితాను ప్రకటించి, 26 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఆగస్టు 31న తుది జాబితాను విడుదల చేసినట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్