EPFO సభ్యులకు కీలక అప్‌డేట్.. PF వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే?

12358చూసినవారు
EPFO సభ్యులకు కీలక అప్‌డేట్.. PF వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే?
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు కీలక అప్‌డేట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఖాతాల్లో వడ్డీ జమ కాలేదు. వడ్డీ జమ తేదీపై కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే గత సంవత్సరాల అనుభవం ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా, వడ్డీ జమ ఆలస్యమైనా సభ్యులకు ఎలాంటి నష్టం ఉండదని EPFO స్పష్టం చేసింది. నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కించి, పూర్తి మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్