ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్

33చూసినవారు
ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్
ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు మొదలయ్యింది. ఈ ఎన్నికలను నాలుగో దశలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల SEC నీలం సాహ్ని చెప్పిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్