ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో సోమవారం భారీ దోపిడీ జరిగింది. వినుకొండకు చెందిన ఓ బంగారు నగలు తయారు చేసే వ్యక్తి, తాను తయారు చేసిన సుమారు కేజీ బంగారు నగలను దుకాణాల్లో ఇచ్చేందుకు వెళ్తుండగా, కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి బంగారు నగలున్న బ్యాగును లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.