ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు టెహ్రాన్‌లో ఉద్విగ్న వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆయన ముగ్గురు కొడుకులు శవపేటికను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, కొత్త సుప్రీం లీడర్, ఖమేని కొడుకు మొజ్తాబా ఖమేని భద్రతా కారణాలరీత్యా హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న
అమెరికా దాడిలో ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు మరణించారు. ఆదివారం రెండో రోజుకు చేరుకున్న ఈ అంత్యక్రియలు వారంపాటు సాగనున్నాయి. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.