AP: కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలిక నిషిత ఆచూకీ లభ్యమైంది. మంగళవారం తెల్లవారుజామున పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వద్ద నిందితుడు మధు బాలికను తీసుకెళ్తుండగా.. అయ్యప్ప మాలధారులు ప్రశ్నించడంతో చిన్నారిని విడిచిపెట్టి పరారయ్యారు. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో అమలాపురం పట్టణ పోలీసులు చేరుకున్నారు. సీఐ వీరబాబు ఆధ్వర్యంలో బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.