వరకట్నం కోసం కిడ్నీ డిమాండ్.. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు

5030చూసినవారు
వరకట్నం కోసం కిడ్నీ డిమాండ్.. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు
యూపీలోని లక్నోలో జరిగిన వరకట్న వేధింపుల ఘటన సంచలనంగా మారింది. వివాహం తర్వాత భర్తకు కిడ్నీ దానం చేయాలని, రూ. 30 లక్షలు ఇవ్వాలని అత్తమామలు బాధితురాలిపై ఒత్తిడి తెచ్చారు. పెళ్లి సమయంలో రూ. 8 లక్షలు, కారు ఇచ్చినప్పటికీ వారి దాహం తీరలేదని బాధితురాలు వాపోయింది. భర్తకు మద్యపానం వల్ల కిడ్నీ సమస్య ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేశారని ఆమె ఆరోపించింది. అత్త బెడ్‌రూమ్‌లో పడుకోవడం, మామ అనుమతి లేకుండా ఫోటోలు తీయడం వంటి వికృత చేష్టలు కూడా చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్