మాతో పెట్టుకుంటే అంతు చూస్తాం: కిమ్ యో జోంగ్

10998చూసినవారు
మాతో పెట్టుకుంటే అంతు చూస్తాం: కిమ్ యో జోంగ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ జపాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జపాన్ ఇటీవల రక్షణ బడ్జెట్‌ను పెంచి, సైనిక శక్తిని విస్తరించడంపై తీవ్రంగా స్పందించారు. పసిఫిక్ సముద్ర తీరంలో జపాన్ చేస్తున్న హడావుడిని చూసి సహనం కోల్పోయిన ఆమె, మాతో పెట్టుకుంటే జపాన్ అంతు చూస్తాం అంటూ టోక్యోను హెచ్చరించారు. జపాన్ విడుదల చేసిన డిఫెన్స్ వైట్ పేపర్‌లో చైనా, రష్యాలతో పాటు ఉత్తర కొరియాను కూడా ప్రధాన భద్రతా సవాళ్లుగా చేర్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్