ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం సులభతరం చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య ఆలయాల్లో కియోస్క్ మెషిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టచ్‌స్క్రీన్ కియోస్క్‌ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, సేవల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఉద్యోగుల అవసరం లేకుండానే టికెట్లు జారీ అవుతాయి. కరూర్ వైశ్య బ్యాంకు ఈ 100 కియోస్క్‌లను అందించడంతో పాటు వాటి ఇన్‌స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది.