రుణం తీసుకునే ముందు ఈ అంశాలు తప్పక తెలుసుకోండి!

6996చూసినవారు
రుణం తీసుకునే ముందు ఈ అంశాలు తప్పక తెలుసుకోండి!
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సి. క్రెడిట్ స్కోరు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే సామర్థ్యం, ప్రాసెసింగ్ ఫీజు, కాలపరిమితి, ముందస్తు చెల్లింపు నిబంధనలు, ఇతర నిబంధనలు, ఇతర బ్యాంకుల ధరలతో పోలిక, లోన్ ఇన్సూరెన్స్, బ్యాంక్ విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఆర్థిక భవిష్యత్తుకు సురక్షితం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్