మీ ఇంట్లో వాడే కొన్ని వస్తువులను ఎప్పుడు మార్చాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిఫ్రిజిరేటర్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి, వాటర్ బాటిళ్లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. బాత్ టవల్స్‌ను ప్రతి రెండు సంవత్సరాలకు, కిరాణా సంచులను కూడా ప్రతి రెండు సంవత్సరాలకు మార్చాలి. బెడ్‌షీట్లను 2-3 సంవత్సరాలకు, ఇంట్లో వాడే చెప్పులను 8-12 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. వీటిని మార్చకపోతే బ్యాక్టీరియా, దుర్వాసనలు, ఫంగస్ పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.