AP:
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత శుక్రవారం గుడివాడకు వచ్చారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట
వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొడాలి నాని రాజకీయాలకు దూరమవుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడి కుమారుడు కొడాలి అర్జున్ రావు ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు కొడాలి నాని యాక్టివ్ అవ్వడంతో ఆయన అనుచరులు సంబరపడిపోతున్నారు.