మాజీమంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో ప్రజలు తనను ఓడించడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారని, అందుకే గుడివాడకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, పార్టీకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లోనూ తప్పుకుంటానని నాని ప్రకటించారు. తన అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు.