2024 ఎన్నికల్లో గుడివాడలో ఓటమి తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. రెండేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న ఆయన, అనారోగ్యం సాకుతో దూరంగా ఉన్నారని ప్రచారం జరిగినా, ఆరోగ్యం మెరుగుపడ్డాక కూడా గుడివాడ వైపు చూడకపోవడంపై అభిమానులు, అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ ఇంచార్జిగా ఉన్నా, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీని పటిష్టం చేసే చర్యలు తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది.