IPL 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో RCB, SRHపై ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పడిక్కల్ బ్యాటింగ్ తీరుపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 'నువ్వు బాగా ఆడుతున్నావ్. ఇలాగే కొనసాగించు. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను మన వైపు లాగేసుకో' అని పడిక్కల్‌కు చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు. డొమెస్టిక్ రెడ్-బాల్ సీజన్‌లో పడిక్కల్ అద్భుత ప్రదర్శన అతడికి కలిసి వచ్చిందని, అతనిలోని ప్రతిభను ఈ స్థాయిలో చూడటం ఇదే తొలిసారి అని కోహ్లీ కొనియాడాడు.