
అమలాపురం: మంత్రి కాళ్లు పట్టుకున్న తల్లీకూతుళ్లు
తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లపై పడి తల్లి కూతుళ్లు విలపించారు. సోమవారం అమలాపురంలో మంత్రిని కలిసిన గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీప్రసన్న.. కొత్తపేటలోని తమ ఆస్తిని మంత్రి బంధువులమని చెప్పుకుంటున్న కొందరు ఆక్రమిస్తున్నారని తెలిపారు. ప్రాణభయం ఉందని కంటతడి పెట్టారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



































