అమలాపురం మండలం సమనసలో సోమవారం ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ప్రమాదం తప్పింది. సాంప్రదాయబద్ధంగా పొలం దున్నుతుండగా, జనాన్ని చూసి బెదిరిన ఎద్దులు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. అప్రమత్తమైన రైతులు వెంటనే ఎద్దులను అదుపు చేయడంతో ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.