తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి: ఎమ్మెల్యే ఆగ్రహం

526చూసినవారు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి: ఎమ్మెల్యే ఆగ్రహం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యిని వాడటం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమేనని, ఇదో మహా పాపమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ధ్వజమెత్తారు. గురువారం అమలాపురంలో జరిగిన ఆలయశుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాద తయారీలో నాణ్యమైన నెయ్యికి బదులుగా పామాయిల్, కెమికల్స్, జంతువుల కొవ్వు కలిపిన ద్రవాన్ని వాడారని సిట్ (SIT) దర్యాప్తులో తేలిందని, 2021-2024 మధ్య కాలంలో సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేశారని, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీకి బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్